Site icon NTV Telugu

BRS in Vanaparthi: బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్‌.. జెడ్పీ ఛైర్మన్ సహా కీలక నేతల రాజీనామా!

Zp Chair Persun

Zp Chair Persun

BRS in Vanaparthi: వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇలాఖాలో రాజీనామాల పర్వం మొదలైంది. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథరెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈరోజు సమావేశం నిర్వహించి పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. లోకనాథరెడ్డితోపాటు పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి సర్పంచ్‌ వెంకటస్వామి సాగర్‌ అదే బాటలో నడుస్తున్నారు. వీరితో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రమేష్ గౌడ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సింగిల్ విండో అధ్యక్షులు, రైతు పోరాట సమితి గ్రామ అధ్యక్షులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి తీరుతో లోక్‌నాథరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తామని ప్రకటించినా.. తమ రాజీనామాపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Read also:Kavita Media Conference: మధ్యాహ్నం మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ

జెడ్పీ చైర్మన్ లోక్‌నాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలు, నష్టాలను భరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు రాలేదన్నారు. మంత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పందన లేదు. అధికార పార్టీ జెడ్పీ చైర్మన్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం విశేషం. వీరంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు నల్గొండ జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌కు మరో సీనియర్‌ నేత చకిలం అనిల్‌కుమార్‌ రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం దక్కలేదన్నారు. 22 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా.. రాజకీయంగా సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు, సమావేశాలకు భారీగా ఖర్చు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. పార్టీ టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో పొత్తుల పేరుతో మరో పార్టీకి అవకాశం ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఇలాగే చేశారని. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపినట్లు అనిల్ తెలిపారు.
AP Health Department: వైరల్ ఫీవర్స్, వడదెబ్బపై అప్రమత్తం.. జూమ్ ద్వారా మంత్రి రజిని సమీక్ష

Exit mobile version