Waiting list Increase: కొత్త సంవత్సరంలో అడుగులు పెట్టేందుకు ఇక కొద్దిరోజు మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలో మొదటి సంవత్సరం జనవరి. జనవరిలో వచ్చే సంక్రాంతి తెలుగు రాష్ర్టాల్లో అతి పెద్ద పండుగల్లో ఒకటి. ఉద్యోగం, విద్య, ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా ఈ పండుగకు సొంతూరి బాట పడుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సంక్రాంతికి ఇంకా నెల రోజులు ఉన్నా సొంతూరుకు వెళ్లేదెలారా దేవుడా అంటూ దిగులు పట్టుకుంది. ఎందుకంటే సొంతూరు రైళ్లలో రిజర్వేషన్లు మూడు నెలల ముందే అయిపోయాయి. ఏ రైళ్లలో చూసిన వెయిటింగ్ లిస్టు పరిమితీ దాటేసింది. అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతారా? ఉన్న రైళ్లకు అదనంగా బోగీలనే జోడిస్తారా అనే ఆశగా ఎదురు చూస్తున్నా ప్రయాణికులకు నిరాశే ఎదురవుతుదేమో? అంటున్నారు ప్రయాణికులు. రోజులు. వారాలు గడుస్తున్నాయి అయితే ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలపై ఏ ప్రకటనలు రాలేదు. నీరక్షణ జాబితా పెరుగుతుండటంతో అనేకమంది ప్రయాణికులు టికెట్లు రద్దు చేసుకుంటున్నారు.
Read also: Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!
జనవరి 12న గోదావరి ఎక్స్‌ప్రెస్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో 1,102 మంది ఉండగా.. 624 మంది టిక్కెట్లు రద్దు చేసుకున్నారు. థర్డ్ ఏసీలోనే 384 మంది వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు తీసుకున్నారు. 11వ తేదీన వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న 784 మందిలో 285 మందిని రద్దు చేశారు. గత సంక్రాంతి సందర్భంగా పండుగకు కొద్ది రోజుల ముందు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే అప్పటికే చాలా మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు వంటి ప్రయత్నాలు ఎంచుకుంటున్నారు. రైళ్లు ఎక్కడానికి వస్తున్న ఆదాయం రైల్వేశాఖ పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుందేమోనని విశ్వసనీయ సమాచారం.
సెప్టెంబరు రెండవ వారం చివరి నాటికి సంక్రాంతి ప్రయాణ తేదీలలో రైలు రిజర్వేషన్‌లు ముగిశాయి. ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంది. ఒక రైలు గరిష్టంగా 24 కోచ్‌లతో నడపవచ్చు. అంతకంటే తక్కువ సంఖ్యలో ఉన్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఐదు కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్న రైళ్లకు ఇదే మార్గం. అదే సమయంలో, క్లోన్ రైళ్లను కూడా నడపవచ్చు. అయితే సంక్రాంతి ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లపై దక్షిణ మధ్య రైల్వే ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వెయిటింగ్ లిస్టులు ఇవే..
* జనవరి 11న ప్రయాణానికి 333 మంది వెయిటింగ్ లిస్టులు ఏసీ రైలులోఉన్నారు. ఇక, గోదావరిలో జనవరి 13న 417 మంది ఈ జాబితాలో ఉన్నారు. అయితే.. కాచిగూడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లో 11న 571 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. జనవరి 11-13 తేదీల్లో చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రశాంతి, సంఘమిత్ర, గువాహటి, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లలో భారీగా వెయిటింగ్ లిస్టు ఉంది.
* ఇక.. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 11న 547 మంది వెయిటింగ్ లిస్టులో ఉండగా.. స్లీపర్‌లోనే 389 మంది ఉన్నారు. దీంతో.. స్లీపర్‌లో 12న, థర్డ్ ఏసీలో 12, 13 తేదీల్లో రిగ్రెట్‌కు చేరింది. కోకనాడ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో 11, 13 తేదీల్లో 200-240 వరకు వెయిటింగ్ లిస్టు ఉండటం.. ‘నర్సాపూర్’లో 11-13 వరకు స్లీపర్, థర్డ్ ఏసీలో రిగ్రెట్‌కు చేరుకుంది.
* ఈనేపథ్యంలో.. శబరి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌లో 11వ తేదీన రిగ్రెట్ కనిపిస్తుండగా, జనవరి 12వ తేదీన ప్రయాణానికి ఏకంగా 770 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అయితే.. రిజర్వేషన్ అయ్యే అవకాశం లేదని 221 మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. ఇక, త్రీటైర్‌లో దాదాపు 100 మంది నిరీక్షణలో ఉన్నా నారాయణాద్రి, సింహపురిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడులా ఉంది.
Fifa World Cup: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమి.. ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు