Votes Counting: రేపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు.
Read also: Astrology: డిసెంబర్ 2, శనివారం దినఫలాలు
రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదనని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు నియోజకవర్గాల్లో గురువారం రాత్రి వరకు పోలింగ్ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోని 79 నియోజకవర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో అన్ని ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించినట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లు, మిగిలిన నియోజకవర్గాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 500 ఓట్లకు ఒక టేబుల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1.80 లక్షల మంది ఎన్నికల కార్యకర్తలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు ఉన్నారని, అందులో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్ జెండర్ అని వివరించారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చాంద్రాయణగుట్ట వీడియోపై నివేదిక కోరినట్లు వెల్లడించారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్…పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?