NTV Telugu Site icon

Vivek: పార్టీ మారినందుకేనా ఈడీ దాడులు.. ఆ.. రూ.27 కోట్ల లెక్క ఈటలను అడగరా!

Vivek Etala Rajender

Vivek Etala Rajender

Vivek: బీజేపీలో ఉన్నంత వరకు ఏమి కాలేదని.. కాంగ్రెస్ పార్టీ లో చేరి గెలిస్తే ఈడీ దాడులా? అని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి.వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. వందల కోట్ల భూమి గురించి అడుగుతున్నారు.. అందులో 27 కోట్లు ఈటెల రాజేందర్ కు ఇచ్చారు మరి దాని గురించి ఈటెల రాజేందర్ ను పిలిచి అడగాలి కదా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ ప్రకటనపై వివేక్ స్పందించారు. బాల్క సుమన్ భయం పట్టిందని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశారని మండిపడ్డారు. బీజేపీ కోసం బాగా పని చేశానని అన్నారు. కేసీఆర్, అమిత్ షా కు ఫొన్ చేసి చెప్పితే నాపై ఈడి సోదాలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతవి, సంబందం లేవి కూడా అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా సమాధానం చెప్పానని, ఈడీ వారికి సహకరించానని తెలిపారు.

మా సంస్థ చట్టం ప్రకారం ట్రాన్స్ క్షన్స్ చేసామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. బీజేపీలో తను ఉన్నంత వరకు ఏమి కాలేదని కానీ.. కాంగ్రెస్ పార్టీ లో చేరతానే ఈడీ మా ఇంటికి వచ్చి దాడులు చేసిందని తెలిపారు. వందల కోట్ల భూమి గురించి తనని అడిగారని.. అయితే అందులో 27 కోట్లు ఈటెల రాజేందర్ కు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నోటీసు ఇచ్చారు.. మరి ఈటెల రాజేందర్ ను పిలిచి అడగాలి కదా? అని వివేక్ ప్రశ్నించారు. అది మా దోస్తు కిషన్ రెడ్డి కంపెనీ… నన్ను చూసుకో మన్నారు.. చూసుకున్న అందులో తప్పేమీ లేదే అన్నారు. 9 కోట్లు టాక్స్ కట్టాము.. అది ఈడీ చెప్పడం లేదన్నారు. ఏదో చేసి నన్ను జైల్లో పెట్టాలని చూస్తున్నారని మండపడ్డారు. జైల్లో పెడితే నాకోసం మీరే ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు కోరారు. సీఎం కేసీఆర్, బాల్క సుమన్, ఈటెల రాజేందర్ పై వివేక్ ఆరోపణలు చేశారు.

వివేక్ తన విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా రూ.100 కోట్ల నగదు బదిలీ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. గతంలో వివేక్ బ్యాంకు ఖాతా నుంచి రూ.8 కోట్లు విజిలెన్స్ సెక్యూరిటీస్ కు బదిలీ అయినట్లు పోలీసులకు తెలిసింది. అనంతరం ఆయన ఇచ్చిన సమాచారంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం ఈడీ బృందాలు వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశాయి. అక్కడ లభించిన ఆధారాలతో వివేక్, అతని భార్య లావాదేవీలపై విశాఖ ఇండస్ట్రీస్ విచారణ చేపట్టింది. FEMA ప్రారంభంలో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు నిధుల బదిలీలో ఉల్లంఘనలను గుర్తించింది. విజిలెన్స్ సెక్యూరిటీ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం ఆర్జించినట్లు బ్యాలెన్స్ షీట్ లో వెల్లడించినట్లు అధికారులు గుర్తించారు.

కంపెనీలో రూ.200 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. అయితే విశాఖ ఇండస్ట్రీస్‌తో విజిలెన్స్‌ సెక్యూరిటీస్‌కు అసలు వ్యాపార లావాదేవీలే లేవని విచారణలో తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీ కూడా వివేక్ ఆధీనంలోనే ఉన్నట్లు విచారణలో తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీస్‌కు యశ్వంత్ రియల్టర్స్ మాతృ సంస్థ అని తేలింది. ఈ రియల్టర్ల షేర్లలో ఎక్కువ భాగం విదేశీయుల పేరిట ఉన్నట్లు తేలింది. విజిలెన్స్ సెక్యూరిటీలను విదేశీ సంస్థతో విలీనం చేయడంలో ఫెమా ఉల్లంఘన జరిగినట్లు ED ప్రాథమిక దృష్టికి వచ్చింది. గ్రూప్ కంపెనీల ప్రాపర్టీ సోదాల్లో లెక్కల్లో చూపని నగదు వాడినట్లు వెల్లడైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జి.వివేక్‌పై ఈడీ కేసు నమోదు చేయడంతో కలకలం రేగింది. బీజేపీని వీడిన కొద్ది రోజుల్లోనే ఆయన ఈడీ రంగంలోకి దిగడం కూడా చర్చనీయాంశమైంది.
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాల జాబ్ కాలెండర్ విడుదల