NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి వివ్రమార్క, మంత్రి తుమ్మల పర్యటన

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం చేరుకుని సోదరుడి దశదినకర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. టేకులపల్లి మండలం కోయగూడెంలో సభలో పాల్గొన్న అనంతరం ఖమ్మం చేరుకుని బస చేస్తారు. భట్టి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడి దశదినకర్మలో పాల్గొన్న అనంతరం సాయంత్రం కొత్తగూడెంలో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి తుమ్మల హైదరాబాద్ వెళ్తారు.

Read also: Hyderabad Air Issue: హైదరాబాద్ లో భారీగా పెరిగిన కాలుష్యం.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో వెల్లడి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైల్వే అభివృద్ధికి కృషి చేయడం వల్లే రైల్వేస్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని బీఆర్‌ఎస్ లోక్‌సభ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రైల్వే సంబంధిత అంశాలను ప్రస్తావించడమే కాకుండా ప్రధాని, రైల్వే మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులకు లేఖలు రాయడం ద్వారా రైల్వేస్టేషన్ల అభివృద్ధి, కొత్త రూట్ల నిర్మాణం, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ, అండర్‌పాస్‌ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ముత్యాలగూడెం, మీనవోలు అండర్‌పాస్‌, కొత్తగూడెం ఆర్‌ఓబి, బ్రిడ్జి, డోర్నకల్‌ పాపటపల్లి అండర్‌పాస్‌, మధిర-మోటమర్రి, ఎర్రుపాలెం-తొండలగోపవరం రోడ్డు అండర్‌పాస్‌లను ఈనెల 26న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని గతంలో లోక్‌సభలో పలుమార్లు ప్రస్తావించారని ఎంపీ గుర్తు చేశారు. నెల. కాగా, అమృత్ భారత్ పథకం కింద ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం, కొత్తగూడెం, మణుగూరు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పార్లమెంటులో మాట్లాడడమే కాకుండా భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ కోసం 125 లేఖలు రాశానని ఎంపీ వెల్లడించారు. కాగా, ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులను సన్మానించిన అనంతరం బ్యాంకు ద్వారా రుణాలు, మూలధన పంపిణీపై చర్చించారు.
Astrology: ఫిబ్రవరి 25, ఆదివారం దినఫలాలు