Guthikoyas: ఈనెల 22న గొత్తికోయల దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును ఖండిస్తూ బెండలపాడు పంచాయతీ తీర్మానం చేసింది. గొత్తికోయలను గ్రామ బిహిష్కరణ చేయాలని నిర్ణయం తీసుకున్న పంచాయితీ మళ్లీ తిరిగి వారి ప్రాంతానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది. అటవీ అధికారిని హత్య చేయడాన్ని ఖండించింది. నిందితులు నివసిందే ఎర్రబోడు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వారిని తరలించాలని గ్రామసభ నిర్ణయం తీసుకుంది.
Read also: Jawan Firing: గుజరాత్ ఎన్నికల విధుల్లో సహోద్యోగులపై జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడెం అయిన ఎర్రబోడు గ్రామంలో మడకం తుల తను సాగు చేసుకుంటున్న పోడు భూములలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ప్లాంటేషన్ మొక్కలు వేశాడు. రోజులాగానే తన పొలంలో పశువుల మేపుతున్న క్రమంలో అటువైపు వెళుతున్న ఫారెస్ట్ రేంజర్స్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు మడకం తులాను హెచ్చరించటంతో అక్కడ చోటు చేసుకున్న గొడవ కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కోడవలతో శ్రీనివాసరావుపై దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న సెక్షన్ ఆఫీసర్ రామారావు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయాలు ఆయ్యాయి. శ్రీనివాసరావుకు ఒళ్లంతా రక్తస్రావం అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం నుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.
Prabhas: రాజ్ తరుణ్ హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్