Site icon NTV Telugu

Vikarabad Crime: కొడంగల్ హైఅలర్ట్.. సూట్ కేస్ లో బాలుడి మృతదేహం

Vikarabad Crime

Vikarabad Crime

Vikarabad Crime: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొడంగల్‌ లో పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసారు దుండగులు. ఎస్సీహాస్టల్ ముందు ముళ్ల పొదల్లో సూట్ కేస్ లో వేసి మృతదేహాన్ని దుండగులు పడేసారు. రాజా ఖాన్ కు 10 సంవత్సరాలు కాగా.. కిడ్నాప్, హత్య కేసులో పోలీస్ లు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుప్త నిధుల కోసమే రాజా ఖాన్‌ ను బలి ఇచ్చినట్లు స్థానికులు తెలుపుతున్నారు. రాజా ఖాన్‌మృతితో కొడంగల్ లో ఉద్రికత్తత పరిస్థితి నెలకొంది. స్థానిక సమాచారంతో పోలీసులు భారీగా కొండగల్‌ చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read also: Shivraj Singh Chouhan: కాంగ్రెస్ ‘జోడో’ అంటుంటే.. నేతలు ‘ఛోడో’ అంటున్నారు

సూట్‌ కేస్‌లో బాలుడి మృతదేహం వుందనే స్థానిక సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకుని సూట్‌ కేస్‌ ను పరిశీలించగా బాలుడి హత్యచేసి సూట్‌ కేస్‌ లో పెట్టి అక్కడపడేసినట్లు గుర్తించారు. అయితే.. గుప్తనిధుల కోసమే ఇదంతా చేశారా? లేక కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నంలో ఏమైనా బాలుడి ప్రాణాలు తీసారా అనే కోణంలో పోలీసులు ముగ్గురు నిందితులను విచారణ చేపట్టారు.

Exit mobile version