దసరా సెలవులు ముగియడంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పల్లెలలో పండుగ జరుపుకున్న ప్రజలు తిరిగి నగరాలకు బయలుదేరడంతో హైవే పై భారీ ట్రాఫిక్ కనిపిస్తోంది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు వరసగా కదులుతూ పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల దూరం వరకూ కొనసాగుతున్నాయి. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతుండగా, బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు ఫీల్డ్‌లో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
Prabhas : ఆ విషయంలో ప్రభాస్ అందరికంటే తోపే..
ఇదిలా ఉంటే.. హిమాయత్‌సాగర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొని ఘర్షణకు గురయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్ళుతున్న దారిలో ముందుగా వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటనా చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది, రాజేంద్రనగర్ పోలీసులు ఘటనస్థలానికి చేరి ట్రాఫిక్‌ను సక్రమం చేశారు. ఏక కాలంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో, ప్రమాదానికి గురైన కార్లలో ప్రయాణిస్తున్నవారికి గాయాలు అందలేదు.
