NTV Telugu Site icon

Vijayashanti: మెదక్ లో విజయశాంతి ప్రచారం.. రోడ్‌ షోలో పాల్గొననున్న రాములమ్మ

Vijayashanti

Vijayashanti

Vijayashanti: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక 7 రోజులే సమయం ఉండటంతో పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈనెల 26న ప్రచారం చేసేందుకు ఈసీ డెడ్ లైన్ విధించింది. దీంతో సమయం కొద్దిరోజులే ఉండటంతో పార్టీ నేతలు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రజలు ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ మెదక్ జిల్లాలో సినీ నటి, టీ-కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ విజయశాంతి పర్యటించనున్నారు.. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ కి మద్దతుగా విజయశాంతి రోడ్ షో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం విసృత ప్రచారం నిర్వహించనున్నారు. రోహిత్‌ ను గెలిపించాలని కోరుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు రాములమ్మ ఇవాళ రోడ్‌ షో నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు వివరిస్తూ ముందుకు సాగనున్నారు. మరి రాములమ్మ ప్రచారం కాంగ్రెస్‌ కు కలిసివస్తుందా? రోహిత్‌ ను గెలిపించేందుకు రాములమ్మ చేపట్టిన రోడ్‌ షోతో కాంగ్రెస్ కి ఏవిధంగా కలిసివస్తుందో వేచి చూడాలి? ఇక మరోవైపు మెదక్‌ లో విజయశాంతి పర్యటిస్తున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. విజయశాంతి మెదక్‌ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది.

Read also: Kota Suicide: పిల్లల ఆత్మహత్యకు కారణం తల్లిదండ్రులే.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారనే వార్తలు నేటితో నిజయం కానున్నారు. మెదక్ లో ఆమె ప్రచారం చేయనున్నట్ల పార్టీ వర్గాలు తెలిపారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశామని విజయశాంతి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్‌లో సాగుతున్నదని విజయశాంతి అన్నారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28వ తేదీ నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొందరు నేతల విమర్శలకు రాములమ్మ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఆ విమర్శలను తాను ఆశీస్సులుగా తీసుకుంటానని రాములమ్మ తెలిపిన విషయం తెలిసిందే.
CM KCR: నేడు ఖమ్మంలో కేసీఆర్‌ పర్యటన.. వైరా, మధిర సభలు

Show comments