కేసుల పెరుగుదలకు.. కారణం తెలంగాణ ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి కెసిఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. “తెలంగాణలో కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోంది. గత మూడు నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు… బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు… వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆ నివేదికలు ఆధారాలతో సహా విశ్లేషించాయి. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రభుత్వ వర్గాల అంకెలు వందల్లో ఉంటే… వాస్తవ పరిశోధన ప్రకారం ఈ కేసులు వేలల్లో కనిపిస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ వెబ్ సైట్లో కరోనా కేసుల గణాంకాలను కొన్నాళ్ళు అప్డేట్ చెయ్యకుండా ఆపేస్తే హైకోర్టు మందలింపుల తర్వాత మళ్ళీ కొనసాగించారు. ఈ వ్యవహారం ఉద్దేశ్యపూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఒక కోణమైతే… పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్ళుగా ఉన్నాయి. కరోనా అనుమానితులు, అరోగ్యంగా ఉన్నవారు… రకరకాల వ్యాధిగ్రస్తులు… అందరినీ గుంపులుగా గంటల తరబడి భౌతిక దూరం, సానిటైజేషన్, ఇతర జాగ్రత్తలేవీ లేకుండా ఒకేచోట నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా? ప్రజారోగ్యాన్ని పక్కనపడేసి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది.” విజయశాంతి ఫైర్ అయ్యారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!