సీఎం కేసీఆర్ పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు తెలంగాణ జిల్లాలకు బొక్కలు… సిద్దిపేట్, సిరిసిల్లలకు మాత్రం ముక్కలు అన్న తీరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు. పల్లెలన్నిటికీ మొక్కలు పెంచే పని ఇచ్చి, కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో మాత్రం నిధుల చెక్కులు పంచే కార్యక్రమం పెట్టుకున్నారని చురకలు అంటిం చారు. ఇంతకు ముందు హుజూర్‌నగర్, నాగార్జున సాగర్‌లలో చేసిన వాగ్దానాలు ఏవీ అమలు చేయలేదని ఫైర్ అయిన విజయశాంతి…తాను గతంలో చెప్పిన ఓ సినిమాలోని కోడి కథ లెక్కనే ఇప్పుడు సిరిసిల్ల, సిద్దిపేట్ వాగ్దానాలు చూసి తెలంగాణ ప్రజలు మొత్తం తమకు వచ్చినట్లు సంబురాలు చేసుకోవాలి కావచ్చు అని ఎద్దేవా చేశారు.
read also : ‘ఫేవరెట్ టీం’ అంటూ వాళ్ళతో మెహ్రీన్… పిక్ వైరల్
ఈ హామీలకు కూడా పైసలు ఎక్కడ నుంచి తీసుకువస్తారో… అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టిన సీఎం గారే చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వేల కోట్ల కమీషన్లు దండుకున్న కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథల ముచ్చట్లు షరా మామూలేనన్నారు. ”ఏదేమైనా… ఎల్లిన చోట్ల హామీల ప్రగతి, ఎల్లని తాన ఏదీ లేని అధోగతి అన్న చందాన ఉన్నాయి కేసీఆర్ గారి పర్యటనలు.” అంటూ రాములమ్మ చురకలు అంటించారు. కేసీఆర్ చెప్పినట్లు అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవ్వాలంటే మరో 60 సంవత్సరాలు పట్టేట్లుందని… అది విడిచిపెట్టి మళ్లీ ఇప్పుడే కొత్త మోసాలకు బయలుదేరారని ఫైర్ అయ్యారు.
