Site icon NTV Telugu

Vijayashanthi: పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు.. అసద్‌ వ్యాఖ్యలపై విజయశాంతి కౌంటర్

Vijaya Shanthi

Vijaya Shanthi

Vijaya Shanthi: MIM అసద్‌ జీ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించవలసిన అవసరం లేదని బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది బీఆరెస్ – కాంగ్రెస్ – ఎంఐఎంల అంతర్గత వ్యవహారమని తెలిపారు. సయామీ ట్రిప్లెట్స్ పై 3 పార్టీలూ ఎన్నికల ముందో తర్వాతో పొత్తో కూటమో, సర్దుబాటో వారికే తెలుస్తుంది అంతేకాని ప్రజలకు కాదన్నారు. స్టీరింగ్ మా చేతిలో ఉంటే దేవాలయాలకు కోట్ల రూపాయల కేటాయింపు ఎట్లా జరుగుతుందని ఓవైసీజీ కామెంట్ మాత్రం పరిశీలించవలసిన అంశమని విజయశాంతి అన్నారు. తమ్ముడు ఈటెల మంత్రిగా కూడా జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతిభవన్ గేటు దాటలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, బైక్ పై వచ్చిన ఎంఐఎం వంటి టీఆర్‌ఎస్‌ సయామీలు లోనికి గౌరవంగా వెళ్లగలుగుతారని ఆరోపించారు. ఇది, ఏ విధమైన అవగాహన అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా..? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ స్టీరింగ్ మా ఎంఐఎం చేతుల్లో ఉన్నదని గతంలో ఎంఐఎం చెప్పినది వాస్తవమని గుర్తు చేశారు. ఆ కామెంట్‌ని బీఆర్‌ఎస్‌ ఎన్నడూ ఖండించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆరెస్ స్టీరింగ్ మా చేతుల్లో లేదు… అని ఎంఐఎం ఎన్నికల సంవత్సరంలో చెబుతుందని.. అందుకు బీఆర్‌ఎస్‌ స్పందన తెలియదని వ్యంగాస్రం వేశారు. కాంగ్రెస్ పార్టీ అంపైర్‌గా ఎంఐఎం, టీఆర్ఎస్‌ చేస్తుందని అన్నారు. కేవలం షాడో బాక్సింగ్ అంతే అంతే తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజాగా నాన్ సెక్యులర్ BJP మజ్లిస్ పై ఆరోపణలు చేస్తోందని ఎంఐఎం నేత అసదుద్దీన్ మండిపడ్డారు. అమిత్ షా ఇక్కడకొచ్చి కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో BJP మజ్లిస్ పేరు జపంచేయటమే పనిగా పెట్టుకొందని మండిపడ్డారు. కొత్త సెక్రెటేరియట్ ఓవైసీ ఆనందం కోసమేనట అంటూ వ్యంగాస్త్రం వేశారు. గుజరాత్ లోని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే TS కొత్త సెక్రెటేరియట్ నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఆనందం కేవలం మసీద్ లోనే ఉందని అన్నారు. మసీదు కూల్చిన చోట కొత్తది నిర్మించలేదు కానీ సెక్రెటేరియట్ పూర్తైంది. గచ్చిబౌలీలో ఇస్లామిక్ సెంటర్ ఇంతవరకు ఏర్పాటుచేయలేదన్నారు. కానీ బ్రాహ్మణ్ సదన్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తైనాయని ఎద్దేవ చేశారు. బ్రాహ్మణ్ సదన్ ప్రారంభోత్సవానికి దక్షిణ భారతంలోని అన్ని ప్రముఖ మఠాధిపతులను ఆహ్వానించారని ఆరోపణలు గుప్పించారు. 2500 కోట్ల నిధులు TS లో మందిరాలకొరకు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు ఉన్నాయో అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణా BJP నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడండి అంటూ సవాల్‌ చేశారు. నా పేరు చెప్పుకొని BJP కడుపు నింపుకోవాలనుకుంటే నాకు అభ్యంతరంలేదని వ్యంగాస్త్రం వేశారు. అమిత్ షా కు తెలుసు ఒవైసీ ఇస్లాం ధార్మికుల సేవకుడని.. అందుకే ఆయనకు భయమని అన్నారు. మజ్లిస్ ను బలహీన పరిచే శక్తి దేశంలో ఎవరికీ లేదని అన్నారు. సెక్రెటేరియట్ పై BJP జెండా ఎగరబోదని తెలిపారు.

అమిత్ షా చెప్పులు మోసే BJP నాయకులు కూడా మజ్లిస్ పై మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లీంల అభివృద్ది నిధులపై ఏడ్చేవారు వారి తండ్రి, తాతల ఆస్తులిస్తున్నారా? అంటూ మండిపడ్డారు. మేముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు గుర్తుంచుకొండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఆదిలాబాద్ లో ఉర్దూ మీడియం ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఎందుకు ఏర్పాటుచేయలేదు? అని ప్రశ్నించారు. ఖుర్షీద్ నగర్ లో షాదీఖానా కొరకు 2 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణం కాలేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్యోగాలకొరకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కేవలం మున్నూరుకాపులకేనా లేక అందరికీ ఉద్యోగాలిప్పించే ఉద్దేశమందా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చోడలో ఉర్దూ కాలేజ్ ఏర్పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీరింగ్ నా చేతిలో ఉందంటున్నారు.. దురదృష్టవశాత్తూ యాక్సిండెంట్ చేస్తానేమో అంటూ వ్యంగాస్త్రం వేశారు.
Guntur Kaaram: ఇది కత్తి కాదు అమ్మొరు కత్తి…

Exit mobile version