NTV Telugu Site icon

Bathukamma 2024: నేడు వేపకాయ బతుకమ్మ.. ఏం చేస్తారంటే..

Batukamma 2024

Batukamma 2024

Bathukamma 2024: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఊరువాడలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ మహిళలు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో మునిగితేలుతున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్లు, వాకిలి శుభ్రం చేసి పూజలు చేస్తారు. అనంతరం బతుకమ్మకు కావాల్సిన పూలను సిద్ధం చేస్తారు. సాయంత్రం బతుకమ్మను ఆకర్షణీయంగా అలంకరిస్తారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంతోషిస్తారు. కొంతమంది మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. మొదటి రోజు ఎంగిలి బతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలు, నాలుగో రోజు నాలుగు వరుసలతో ఇలా ఒక్కోరోజు ఒక్కో విధంగా బతుకమ్మను పేర్చుతూ.. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని పేరు.

Read also: Iran Israel War: ఒకే గంటలో 100 యుద్ధ విమానాలతో లెబనాన్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్

ఈరోజు బతుకమ్మ పేర్చలేదు. అలాగే నైవేద్యం పెట్టలేదు. ఏడో రోజు నేడు మహిళలు వేపకాయ బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. ఈరోజు బియ్యప్పిండి వేయించి, బెల్లం వేసి, వేపపువ్వు ఆకారంలో చేసిన వంటకాన్ని గౌరమ్మకు నివేదిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు వేపకాయ బతుకమ్మ అని పేరు వచ్చింది. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల వరకు పేర్చి వాటిపై గౌరమ్మను పెడతారు. వేపచెట్టు అంటే ఆదిదేవత యొక్క నిజమైన ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తిని పూజిస్తూ మహిళలు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. సకినాలు చేసిన పిండితో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
Heartbreaking Incident: కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే ఇంటికి వెళదాం..

Show comments