Site icon NTV Telugu

Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం!

Vemulawada Temple

Vemulawada Temple

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు.

Also Read: Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

అలాగే భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణం, ఉత్తర భాగాలలో ప్రాకారం.. పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేశారు. దేవాదాయశాఖ కమిషనర్, ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసి వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version