Vellore Institute of Technology – Andhra Pradesh
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఫినోమినా (ICATP 2022) 3-రోజుల అంతర్జాతీయ సదస్సు 16 జూలై 2022 నుండి 18 వరకు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ డీన్ డా || శాంతను మండల్ అంతర్జాతీయ సదస్సుకు హాజరయిన అతిథులందరికీ స్వాగతం పలికారు, అనంతరం సదస్సు కన్వీనర్ డా || రష్మీ దూబే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) చైర్మన్, JNTU-అనంతపురంలోని మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డా || కె. హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. అయన మాట్లాడుతూ ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు రవాణా దృగ్విషయాల రంగంలో పరిశోధన కోసం విస్తృతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని, గణన అంశాలలో యువ పరిశోధకులు మరియు ప్రొఫెసర్లకు విస్తృత అవకాశాలకు ఉన్నాయని తెలియచేసారు. విద్యార్థుల కోసం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంతో పాటు అత్యుత్తమ విద్యను అందించటంలో విఐటి-ఏపి విశ్వవిద్యాలయం ఎల్లప్పుడు ముందుంటుందని కొనియాడారు . విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డా|| జి విశ్వనాథన్ మాట్లాడుతూ జాతీయ మరియు ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో మార్పులను తీసుకురావడానికి ఈ సదస్సు ద్వారా కృషి చేయాలనీ సదస్సులో పాల్గొన్న ఒత్సాహికులను ప్రోత్సహించారు.
విఐటి-ఏపి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ ప్లేస్‌మెంట్స్, పబ్లికేషన్స్, పేటెంట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ర్యాంకింగ్‌ల లో విఐటి-ఏపి విశ్వవిద్యాలయం సాధించిన ప్రముఖ విజయాలను వివరించారు. ఇటువంటి అంతర్జాతీయ సదస్సులను విఐటి-ఏపి విశ్వవిద్యాలయం నిర్వహించటం గర్వకారణమని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో సదస్సులు నిర్వహిస్తామని తెలియచేసారు.విఐటి-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సదస్సులో యూనివర్సిటీ అఫ్ బోలోగ్నా(ఇటలీ), క్వీన్స్ యూనివర్సిటీ (కెనడా), యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్(యుకె ), న్యూయార్క్ యూనివర్సిటీ (యుఎస్ఏ), యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ (యుఎస్ఏ) మరియు ఐఐటిలు, ఐఐఎస్సీ, టిఐఎఫ్ఆర్, బిట్స్, సిఎస్ఐఆర్ -ఐఐసిటి వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు , విద్యాసంస్థల నుండి 13 మంది ప్రముఖ వక్తలు పాల్గొన్నారని, భారతదేశంలోని 18 రాష్ట్రాలు మరియు ప్రపంచవ్యాప్తంగా 8 విభిన్న దేశాల నుండి సుమారు 100 పేపర్ ప్రజెంటేషన్‌లతో, 180 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని మరియు కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ఓపెన్ బుక్ పబ్లిషర్ ద్వారా ప్రచురించబడతాయని తెలియచేసారు. చివరిగా ఈ సదస్సుకు హాజరయిన ముఖ్యఅతిథికి, ప్రముఖ వక్తలు, ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధాయ్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
