Site icon NTV Telugu

V. Hanumantha Rao: గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయి..

V.hanumantha Rao

V.hanumantha Rao

V. Hanumantha Rao: గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఏ.ఐ.సి. సెక్రెటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సంగీతం శ్రీనివాస్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ.. ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడన్నారు. గతంలో కేదార్నాథ్, మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చుని ధ్యానం చేశాడన్నారు. వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారని, మోడీ మతం పేరు మీదా ధ్యానం చేసారన్నారని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని, మేము నమ్మే స్థితిలో లేమన్నారు. బీజేపీ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు, 15 లక్షల అకౌంట్ లో వేస్తానని, రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదని గుర్తు చేశారు.

Read also: MLC Kavitha: నేడు కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు కల్పించామన్నారు. మోడీ అదాని, అంబానీకి కట్టబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే.. ఇక్కడి రైతులకు సహాయం చేయలేదు కానీ.. పంజాబ్ వెళ్లి అక్కిడి రైతులకు నష్టరిహారం చెల్లించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లి.. ఇచ్చిన మాటకు కట్టుబడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో 12 వందల మంది చనిపోయారు వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి, ఉద్యమం చేసిన సరైన న్యాయం చేస్తామన్నారు. కుల గణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం వస్తె అగ్ర కుల నాయకులకు పదవులు కట్టబెడుతాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయని తెలిపారు.
Mobile Wallet: ఫోన్ ల వెనుక వాలెట్ వాడుతున్నారా.. ఎంత డేంజరో తెలుసా?

Exit mobile version