Site icon NTV Telugu

Uttam Kumar Reddy: వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక.. వానాకాలం లోపు పూర్తవ్వాలి..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని నీటి పారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జలసౌధపై ఇవాళ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త ఆయకట్టు కు సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏడాది చివర నాటికి కొత్తగా 4.5 నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరందించే విదంగా ప్రాజెక్టుల పనులు వేగవంతం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కవ చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదన్నారు. ఇప్పుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలని సూచించారు. రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టు లపై పనులు వేగవంతం చేయాలన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలని.

Read also: Big Breaking: ఇండియా కూటమి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఏకగ్రీవం

కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. కొత్త ఆయకట్టు కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలన్నారు. రాబోయే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తవ్వాలని కోరారు. ఐడిసి పరిడిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు. గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జి గారికి లేఖ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం జోరుతున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీరు మనకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మహారాష్ట్ర కు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తి కి సంబందించిన వ్యయం అందిస్తామని సూచించామని తెలిపారు.
Minister Jogi Ramesh: ప్రజాయుద్ధంలో ఎవరూ జగన్‌ను ఓడించలేరు.. 20 ఏళ్లు జగన్‌ పాలనే..!

Exit mobile version