నేడు ఉదయం చారిత్రాత్మక చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లతో కలిసి సందర్శించారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మి దేవాలయ ట్రస్టీ చైర్మన్ శశికళ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రో చ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ వారి మహా హారతిలో పాల్గొన్నారు.
read also: Andhra Pradesh: గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త.. న్యూస్ పేపర్ల కోసం ప్రత్యేకంగా డబ్బులు
అమ్మవారి ఆలయానికి సందర్శించిన ఆదిత్యనాథ్, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ లను అమ్మవారి కండువా తో ఘనంగా సన్మానించారు. చార్మినార్ భాగ్య లక్ష్మి అమ్మ వారి చిత్రపటాన్ని యోగి కి బహుకరించారు. అనంతరం యోగి రాకతో చార్మినార్ పరిసరాలు కాషాయ జెండాలతో రెపరెపలాడగా.. భారత్ మాతాకి జై.. జై శ్రీ రామ్.. జై జై శ్రీరామ్.. యోగి మహారాజ్ కి జై.. బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి.. రాజా భయ్యా జిందాబాద్.. బుల్ డోజర్ బాబా కి జై.. అంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పెటున నినాదాలు చేశారు. కాగా.. ఉదయం 7.50 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి.. 8.07 గంటలకు అమ్మవారి ఆలయం నుంచి ఆయన బయలు దేరి వెళ్లారు.
