NTV Telugu Site icon

ఇందిరాపార్క్ వద్ద క‌ల‌క‌లం సృష్టించిన ఫ్లెక్సీ… వారికి ప్రవేశం లేదు…

ఇందిరాపార్క్ లో ఉద‌యం, సాయ‌త్రం స‌మ‌యాల్లో పెద్ద సంఖ్య‌లో న‌గ‌ర‌వాసులు వాకింగ్ చేసేందుకు వ‌స్తుంటారు.  అయితే, ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కు సామాన్య‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌వేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువ‌గా ప్రేమ జంట‌లు వ‌స్తుంటాయి.  అయితే, గ‌త కొంత‌కాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారుతుండ‌టంతో పార్క్ యాజ‌మాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది.  పెళ్లికాని జంట‌ల‌కు ప్ర‌వేశం లేద‌ని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.  దీంతో నెటిజ‌న్లు ఈ ఫ్లెక్సీపై దుమ్మెత్తిపోశారు.  పెళ్ల‌యిన జంట‌ల‌ను ఎలా గుర్తిస్తార‌ని ప్ర‌శ్నించారు. పార్క్‌కు రావాలంటే మ్యారెజ్ స‌ర్టిఫికెట్ తీసుకురావాలా అని ప్ర‌శ్నిస్తూ కామెంట్స్ చేశారు.  దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగ‌డంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంట‌నే ఆ ఫ్లెక్సీని తొల‌గించారు.  అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  అయితే, పార్క్‌లో పోలీసుల నిఘాను ఏర్పాటు చేస్తున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  

Read: మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌: త‌గ్గిన పుత్త‌డి ధరలు…