Unknown Dead Body Found At Langar House Musi: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ వెనుక భాగంలో మూసీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక ఉస్మానికా మార్చరీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా చంపి మూసీలో ఈ శవాన్ని పడేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక మూసీలో ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కడినుంచైనీ ఇది కొట్టుకొని వచ్చిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రెండు నెలల వ్యవధిలో మూవీలో లభ్యమైన నాలుగో మృతదేహం ఇది. ఒకటి ఆఫీస్ నగర్ పోలీస్ లిమిట్స్‌లో దొరగ్గా.. మరో రెండు మృతదేహాలు కుల్సుంపర లిమిట్స్‌లో లభ్యమయ్యాయి.
Hyderabad Crime: మూసీలో మృతదేహం.. రెండు నెలల వ్యవధిలో నాల్గొవది

Moosi Nadhi Mruthadeham