మందు బాబులకు బీర్ల సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీ ప్రకటించింది. వినియోగదారులు కార్మికులు వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్లు యూబీ సంస్థ ప్రకటించింది. తాము టీజీబీఎల్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని, బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదల వంటి సమస్యలను బేవరేజెస్ కార్పొరేషన్ సమాయనుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపింది.
ఇది కూడా చదవండి: DGP Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ.. ఆసక్తికర కామెంట్లు..!