Site icon NTV Telugu

Kishan Reddy: నేడు యాదాద్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: నేడు యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్‌ రెడ్డి పరిశీలించనున్నారు. పోచంపల్లి మండల కేంద్రంతో పాటు, రేవన్నపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఈ రోజు, ఈ నెల 11, 13 తేదీల్లో బీజేపీ బృందాలు వరి కొనుగోలు కేంద్రాల పరిశీలించనున్నారు. కాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రానున్న సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షడు డబ్బీకార్‌ సాహేశ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోచంపల్లిలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు, రేవనపల్లి, గౌస్‌కొండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్‌ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల వద్దకు స్వయంగా ఆయన వెళ్లి మాట్లాడుతారని వివరించారు.
CM Revanth Reddy: నేడు ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి..

Exit mobile version