Kishan Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లో పనిచేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం హోంగార్డు అధికారుల ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. అయితే హోంగార్డు రవీందర్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హోంగార్డు రవీందర్ ను కలిసి పరామర్శించేందుకు మధ్నాహ్నం ఒంటి గంటకు ఆసుపత్రికి రానున్నారు. రవీందర్ ను కుటుంబ సభ్యులను కలిసి సమస్యను తెలుసుకోనున్నారు.
హోంగార్డు రవీందర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కంచన్ బాగ్ లోని హాస్పిటల్ వద్దకు హోంగార్డులు భారీగా చేరుకుంటున్నారు. మేము ప్రభుత్వం , ఉన్నతాధికారులకు వ్యతిరేకం కాదని తెలిపారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్నామని తెలిపారు. మా సహచర హోంగార్డ్ కుటుంభం ఇప్పుడు రోడ్ పై వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ, రెవెన్యూ లో వీఆర్ఏ ల మాదిరి హోంగార్డ్ లను కూడా కూడా పర్మినెంట్ చేయాలని జేఏసీ నాయకుడు ధర్మారావు డిమాండ్ చేశారు. మాలో ఇంకొకరి ప్రాణాలు పొకముందే ప్రభుత్వం స్పందించాలని కోరారు. అయితే రవీందర్ ఆత్మహత్యపై జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నంపై హోమ్ గార్డ్స్ అందరు హాస్పిటల్ కు రావాలని పిలుపు నిచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
హోంగార్డులు ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్య యత్నం పై వెంటనే ప్రభుత్వo స్పందించాలని హోంగార్డు JAC సభ్యులు నారాయణ అన్నారు. రవీందర్ బ్రతకడం చాలా కష్టమన్నారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల విధులు బహిష్కరణకు పిలుపు ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణకు హోంగార్డు జేఏసీ సభ్యులు కూడా మద్దుతు తెలపడంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆందోళన చేపట్టారు. సకాలంలో హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు విధులు బహిష్కరిస్తామన్నారు. హోంగార్డులు ఎవ్వరు విధుల్లో ఉండకూడదని, తమ డిమాండ్ అను ప్రభుత్వం ఒప్పుకుంటేనే విధుల్లో వస్తామని కోరారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్యపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జెఏసీ నాయకులు మండిపడుతున్నారు.
Andhra-Telangana: ఉప్పొంగిన కట్టలేరు వాగు.. ఆంధ్ర-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్…
