Site icon NTV Telugu

Kishan Reddy Padayatra: కిషన్ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం

Kishanreddy Padayatra

Kishanreddy Padayatra

Union Minister Kishan Reddy Padayatra: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాదయాత్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రజలు, స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. ఇక రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తారు. అయితే.. సికింద్రాబాద్‌ పరిధిలోని అడ్డగుట్ట, తుకారంగేట్‌ బస్తీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు నిన్న(26)న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే.. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని ఈ క్రమంలోనే గేట్-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లోనే గేట్ పరీక్ష నిర్వహించేవారు. ఈ సందర్భంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.

 

Exit mobile version