Site icon NTV Telugu

దక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఫిల్మింనగర్‌లో ఏర్పాటు చేసిన దక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలెవరూ గత సంవత్సరకాలంగా బయటకు రావడంలేదని.. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలు మెచ్చే అభిరుచులతో దక్కన్‌ కిచెన్‌ ఫైన్‌ రెస్టారెంట్‌ మరో బ్రాంచ్‌ను ఫిల్మింనగర్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

Exit mobile version