NTV Telugu Site icon

Nalgonda Chopper Crash : స్పందించిన కేంద్ర మంత్రి

నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో మహిమ అనే మహిళ పైల‌ట్‌ మృతి చెందింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. వైద్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర విమాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వట్టర్‌లో స్పందింస్తూ.. తెలంగాణలోని నల్గొండలో శిక్షణ విమానం కూలిన ఘటన విని షాక్‌కు గురయ్యారు.

ఘటనా స్థలానికి దర్యాప్తు బృందాన్ని తరలించాం. దురదృష్టవశాత్తు, మేము విద్యార్థి పైలట్‌ను కోల్పోయాము. ఆమె కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి.’ అంటూ పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరకున్నారు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిని ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు.