NTV Telugu Site icon

Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి.. భువనగిరి సభలో అమిత్ షా ప్రసంగం

Amit Shah

Amit Shah

Amit Shah: పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) రాత్రి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. రేపు గురువారం (మే 9) అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. భువనగిరిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.

Read also: Darshini: మే 17న థియేటర్లలోకి థ్రిల్లర్ ‘దర్శిని’

ఇక ఈ సభలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా స్థానిక రాయిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భువనగిరి స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు పట్టణ శివారులోని స్పిన్నింగ్ మిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ను బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాసం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరితో పాటు కేంద్రంలో భాజపా విజయం సాధిస్తుందన్నారు. అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ మల్లింపు ఉంటుందని, వాహనదారులు గమనించాలని కోరారు. అమిత్ షా సభ దృష్ట్యా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు సహకరించాలని తెలిపారు.
CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

Show comments