NTV Telugu Site icon

Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భువనగిరిలో పబ్లిక్ మీటింగ్..

Amit Shah

Amit Shah

Amit Shah: పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Read also: Samsung Galaxy F55 5G : శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?

యాదాద్రి జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి అమిత్ షా నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రానికు చేరుకుని హైదరాబాద్‌లోనే బస చేశారు. ఇవాళ ఉదయం 10.45కి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో భువనగిరికి చేరుకొనున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు భువనగిరిలో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. ఉదయం 11.45 వరకు పబ్లిక్ మీటింగ్ లో ఆయన ప్రసంగించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా స్థానిక రాయిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.

Read also: Patiala : రైతుల ఉద్యమం, అంతర్గత పోరులో ఇరుక్కున్న పార్టీలు

మధ్నాహ్నం 12 గంటలకు తిరిగి భువనగిరి నుండి మధ్యాహ్నం 12.15 కు బేగంపేటకు ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు అమిత్ షా. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ లో కాసేపు రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడనున్నారని సమాచారం. కాగా.. అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని
బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాసం భాస్కర్ పిలుపునిచ్చారు. అమిత్ రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ మల్లింపు ఉంటుందని, వాహనదారులు గమనించాలని కోరారు. అమిత్ షా సభ దృష్ట్యా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు సహకరించాలని తెలిపారు. ఈ మేరకు పట్టణ శివారులోని స్పిన్నింగ్ మిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ను పాసం భాస్కర్ పరిశీలించారు.
Astrology: మే 09, గురువారం దినఫలాలు