TS Paddy Procurement: బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Department of Food and Public Distribution Given Clarification on the Suspension of Telangana Paddy Procurement.
బియ్యం సేకరణ నిలిపివేయడం పై కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. అన్న యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటనలో ఆరోపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి సేకరించడాన్ని నిలిపివేసిందని, ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోని వైనాన్ని గమనించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచుల మాయమవడాన్ని గుర్తించామని, డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించామని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అన్న యోజన పథకం కింద ఏప్రిల్-మే నెలల కోటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. కానీ ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరణను నిలిపివేసిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!