NTV Telugu Site icon

ACP Uma Maheswara Rao: బయటపడుతున్న ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు..

Acp Uma Maheswara Rao

Acp Uma Maheswara Rao

ACP Uma Maheswara Rao: నేడు ఉమా మహేశ్వర్ రావును నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరావుని అరెస్టు చేసి ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో అధికారులు విచారిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఉమామహేశ్వర రావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కాగా.. ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. న్యాయం కోసం వెళ్ళిన బాధితులకు చుక్కలు చూపించినట్లు దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, తనపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడిందన్నారు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read also: Warangal Bus Stand: వరంగల్ పాత బస్ స్టాండ్ కూల్చివేత..

సిసిఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు జరిపారని అన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్నారై ను సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్లు వెల్లడించారు. ఉమా మహేశ్వర రావు బూతు పురాణం పై సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బంది నీ సైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు. తన దగ్గరికి వచ్చినప్రతి కేస్ లోను ఉమా మహేశ్వర రావు చేతివాటం చూపించాడని, అక్రమ ఆస్తుల కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చాయి. తన ఇంట్లో నగదు ఉంచకుండా, తన అత్త మామల ఇంట్లో డబ్బును ఉంచినట్లు సమాచారం. లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్ లో రాసుకున్నారని, బహిరంగ మార్కెట్ లో 50 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు.

Read also: Second Hand Phone: సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధింద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏసీబీ బృందం ఏడు చోట్ల సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగదు, లాండ్ పత్రలు బంగారు వెండి ఆభరణాలు సీజ్ చేసామన్న విషయాలు తెలిపారు. ఏసీపీపై చాలా అభియోగాలు వచ్చాయని చెప్పారు. 17 ప్రపార్టీస్ గుర్తించామని.. 5 ఘాట్కేసర్ లో, 7 వైజాగ్ చోడవరం భూములు కొన్నారన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ 4 ఫ్లాట్ గుర్తించామన్నారు. శామీర్ పెట్ లో 1, కూకట్ పల్లి 1 మల్కాజీర్ 1 భూములు కొన్నారని తెలిపారు. సోదాల్లో రూ.37 లక్షలు, 60 తులాల బంగారం, రూ.3కోట్ల 40 లక్షలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ చెప్పలేమని పేర్కొన్నారు. రెండు లాకర్లను గుర్తించినట్లు చెప్పారు. ఏసీపీ ఉమేశ్వరరావు ఆస్తులు రూ. 40 కోట్లుగా తేల్చామన్నారు. గవర్నమెంట్ విలువ ప్రకారం రూ. మూడు కోట్ల 40 లక్షల రూపాయల ఆస్తులను గుర్తించామన్నారు.శామీర్ పేట్ లో ఒక విల్లా ఉందన్నారు.
Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!

Show comments