Site icon NTV Telugu

Umar Jalil : జూన్ 20 లోపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Telangana Inter Board

Telangana Inter Board

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే.  ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. విద్యార్థులు చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు రాశారు.  ఈ నేపథ్యంలో తాజాగా తెలంగా ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయని.. కానీ.. ఇంకా రెండు చిన్న పరీక్షలు మిగిలి ఉన్నాయిన్నారు. అవి 5 వేల లోపే విద్యార్థులు రాస్తారని ఆయన తెలిపారు. ఈ సారి చిన్న చిన్న మిస్టేక్స్ జరగాయన్న ఉమర్‌ జలీల్.. సిబ్బంది కష్టపడి పని చేశారన్నారు. నెల లోపే ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. పొరపాట్లను వెంటనే సరిదిద్దామని, వచ్చే పరీక్షల్లో మిస్టేక్స్ లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో వేర్వేరు ప్రశ్నలు వచ్చిన చోట ఏ ప్రశ్నకు సమాధానం రాసిన పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రాల్లో పేపర్ మూల్యంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. 15 వేల మంది పేపర్ వాల్యుయేషన్‌లో పాల్గొంటున్నారని, జూన్ 20 లోపు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

Exit mobile version