NTV Telugu Site icon

Secunderabad PG Hostel: లేడీస్‌ హాస్టల్‌ లో చొరబడి ఇద్దరు యువకులు.. సికింద్రాబాద్ లో ఘటన

Secendrabad Pg Ledis Hostel

Secendrabad Pg Ledis Hostel

Secunderabad PG Hostel: సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ లో ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. అర్దరాత్రి ఉమెన్స్ హాస్టల్ లోని బాత్ రూం లో ఇద్దరు ఆగంతకులను గుర్తించిన విద్యార్థినిలు గట్టిగా కేకలు వేశారు. వారిని పట్టుకునేందుకు విద్యార్థినులు పరుగులు పెట్టారు. అయితే ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ నుంచి పరార్ అయ్యాడు. అయితే ఒకరు ఆగంతకున్ని పట్టుకున్న విద్యార్థినిలు దేహశుద్ధి చేశారు. ఆగంతకుని అక్కడే కట్టేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ క్యాంపస్ కు వచ్చారు. ఆగంతుకుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా విద్యార్థినిలు అడ్డుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తీసుకుపోవద్దంటూ పోలీసు వాహనాలకు విద్యార్థినులు అడ్డంగా కూర్చున్నారు. వాహనాలు కదిలించేది లేదని భీష్మించుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు.

Read also: Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఇద్దరికి గాయాలు

దీంతో పీజీ ఉమెన్స్ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ కి రిజిస్టార్ వచ్చారు. రిజిస్టార్కు వ్యతిరేకంగా విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ కు నచ్చచెప్పేదుకు అధికారులు, పోలీసులు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. అయినా విద్యార్థినిలు ససేమిరా అంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మాని యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గుడార్రాలాంటి హాస్టల్లో తాము నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి ఒకే ఒక్క ఫిమేల్ సెక్యూరిటీ గాడు ఉంటుందని, దీంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని చెప్పినా.. అయినా యూనివర్సిటీ అధికారులు, కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఇప్పటికైనా అధికారలు, పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. సరైన వసతులు లేవని ప్రధానోపాధ్యాయులు, రిజిస్ట్రార్ వినడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని, భద్రతా గోడలు చిన్నగా ఉండడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలోనే హాస్టల్ వార్డెన్‌కు సూచించామని తెలిపారు. ఇప్పుడు హాస్టల్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని.. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? తమకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని.. తమ సత్తా చాటుతామని హెచ్చరించారు.

YS Sharmila: నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..