Steroids selling: వేసవి మొదలైంది. దీంతో నగరాల్లో జిమ్‌లకు వెళ్లేవారు ఎక్కువైపోయారు. ఉదయం, సాయంత్రం పూట జిమ్‌లకు వెళ్లి చెమటోడుస్తూ ఉంటారు. ఆఫీసు ఒత్తిడి, బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ చేసే టైమ్ ఉండదు. దీంతో చాలామంది యువత జిమ్‌లకు వెళ్లి వర్కౌట్లు చేస్తూ త్వరలో ఫిట్‌నెస్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. దీని కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరి వీక్‌నెస్‌ను ఆసరా చేసుకుని ముఠాగా ఏర్పడి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. స్టెరాయిడ్స్ విక్రయిస్తూ యువత నుంచి డబ్బులు గుంజుకుంటుంది. తాజాగా హయత్ నగర్ లో చోటుచేసుకుంది.
హయత్ నగర్ లోని బాలాజీ, ప్రసాద్ లు జిమ్ కు వెళ్లేవాల్లే టార్గెట్ చేశారు. అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారంతో ముఠాలపై పోలీసులు నిఘా పెట్టారు. అనంతరం దాడులు చేపట్టి స్టెరాయిడ్స్ అమ్ముతున్న ముఠాలను అరెస్ట్ చేశారు. అలాగే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్లను గుట్టుగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరిని అదుపులో తీసుకున్నారు. ఇద్దరు నిందితుల నుండి 30 ఇంజక్షన్స్, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. మందుల ధర, ప్రిస్క్రిప్షన్ మీద, మార్కెట్‌లో 268 అయితే, ఇద్దరూ నిందితులు డిమాండ్‌ను బట్టి స్టెరాయిడ్స్ ను 1,000 నుండి 2,000 విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యువకులకు స్టెరాయిడ్స్ విక్రయించడం మొదలు పెట్టారని, పైసలు సంపాదించేందుకు స్టెరాయిడ్స్ విక్రయాల్లో ఆరితేరిపోయారన్నారు. జిమ్ కి వెళ్ళే యువకులు కండరాల ఎదుగుదల కోసం ఉపయోగించే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్స్ ను ప్రసాద్, బాలాజీ అమ్ముతున్నారు. నిందితులు ప్రసాద్ , బాలాజీ ఇద్దరు సమీప బంధువులే కావడం విశేషం. బాలాజీ హయత్ నగర్ లోని మక్సి క్యూర్ లో సెక్యూరిటీ గార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు, ప్రసాద్ శ్రీనివాస్ హాస్పిటల్ లో కంపౌండర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. అధిక డబ్బులు, జల్సా జీవితానికి అలవాటు పడిన ఇద్దరు నిందితులు హార్మోన్స్ ఇంజెక్షన్ విక్రయాలపై తెలుసుకున్న పోలీసులు వీరి భాగోతాన్ని గుట్టురట్టు చేశారు.
హయత్ నగర్ మాక్సిక్యూర్ హాస్పిటల్ మేనేజర్..
ఇది ఇలా ఉండగా.. హయత్ నగర్ మాక్సిక్యూర్ హాస్పిటల్ మేనేజర్ రంగ నాయక్ మాట్లాడుతూ.. ప్రిస్క్రిప్షన్ లేకుండా మాక్సీ క్యూర్ హాస్పిటల్ నుండి ఏ ఒక్క మెడిసిన్ బయట వెళ్ళదని స్పష్టత ఇచ్చారు. అలాంటిది స్టెరాయిడ్స్ ఎలా వెళతాయని ప్రశ్నించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. మా హాస్పిటల్ కి స్టెరాయిడ్స్ ఇల్లీగల్ ఇంజెక్షన్లు కీ సంబందం లేదని తెలిపారు. కావాలనే కొందరు మా హాస్పిటల్ నేమ్ బ్లేమ్ చేస్తున్నరని మండిపడ్డారు. మా హాస్పిటల్ నుండి ఎలాంటి స్టెరాయిడ్స్ బయట విక్రయం జరగలేదని తెలిపారు. మా హాస్పిటల్ కు సంబందం లేదని, ప్రసాద్ అనే సెక్యూరిటీ మా వద్ద అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్నాడని అన్నారు. అతను వారం రోజుల నుండి లీవ్ లో ఉన్నాడని, సెక్యూరిటీ ప్రసాద్ పై మేము కూడా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సెక్యూరిటీ ప్రసాద్ మామ బాలాజీ హయత్ నగర్ లోని శ్రీనివాస హాస్పిటల్ లో కంపౌండర్ గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్ హాస్పిటల్ నుండి స్టెరాయిడ్ ఇంజక్షన్స్ బయటకు వెళ్లినట్లు మాకు తెలిసిందని అన్నారు.
Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు ఇద్దరు మృతి