Site icon NTV Telugu

Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం.. ఇద్దరు డిగ్రీ విద్యార్థినిలు సూసైడ్

Nalgonda Students Susaide

Nalgonda Students Susaide

Nalgonda Crime: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ రాజీవ్‌ పార్క్‌లో మంగళవారం ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు విద్యార్థినిలు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఇద్దరు బాలికలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఇటీవల సెలవుల కారణంగా గత 20 రోజులుగా ఇంటి వద్దనే ఉన్న వీరిద్దరు కళాశాలకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పి మంగళవారం (సెప్టెంబర్ 5) కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో నల్గొండ చేరుకున్నారు. ఆ తర్వాత నాగార్జున కాలేజీ వెనుక ఉన్న రాజీవ్ పార్కు వద్దకు వెళ్లారు. తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును తాగారు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అనంతరం పార్క్ గేటు బయట చెట్టుకింద కుప్పకూలిపోయాడు.

Read also: Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తమ పిల్లలకు ఎవరితోనూ పరిచయం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నామో అర్థం కావడం లేదని విలపిస్తున్నారు. అయితే అమ్మాయిల వాట్సాప్ డీపీ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి బెదిరించి ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించారు. వారిని ఎవరైనా నిజంగా బ్లాక్ మెయిల్ చేశారా? మరేదైనా కారణంతో వారు చనిపోయారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే వారి ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఇద్దరు విద్యార్థినులు మధ్యే ఎక్కువగా ఫోన్ సంభాషణ ఉన్నట్లు తెలిసింది. వారి బ్యాగులో నిద్రమాత్రలు లభించాయని పోలీసులు తెలిపారు. విద్యార్థినులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Health Tips: స్ట్రాబెర్రీలతో ఆ సమస్యలకు చెక్..

Exit mobile version