NTV Telugu Site icon

Robbery in Jagtial: మీ కక్కుర్తి పాడుగాను.. ఇలా కూడా దొంగతనం చేస్తారా..!

Robbery In Jagtial

Robbery In Jagtial

Robbery in Jagtial: జనాలు కష్టపడి సంపాదించడం చేతకాక అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరైతే ఇతరుల అమాయకత్వాన్ని ఉపయోగించుకుని మోసం చేసి దోచుకుంటున్నారు. ఇవేవి తెలియని ఇంకొందరు మాత్రం.. పాత పద్ధతిలోనే పని కానిస్తున్నారు. అదేనండి.. గుర్రపుస్వారీ కళను నమ్ముకుని బండిని లాగుతున్నారు. కానీ.. దొంగలు పెద్దపెద్ద ఇళ్లను చూసుకుని దోచుకోవడం.. చైన్లు లాగి.. బండ్లు, కార్లు దొంగిలించి అమ్మేస్తారని అనుకుంటాం.. కానీ ఇక్కడ ఇద్దరు దొంగలు మాత్రం మరీ కక్కుర్తిపడ్డారు. పొలాల సమీపంలో ఉంచిన మోటార్లలోని రాగి తీగలను దొంగిలిస్తూ రైతులు కంటపడ్డారు. దీంతో రైతులు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగలు దొరికితే ఇక రైతులు ఊరుకుంటారా? ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో చోటుచేసుకుంది.

Read also: Gas leakage: ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీక్.. ఉదయం నుంచి ఉద్ధృతంగా ఎగిసిపడుతోన్న మంటలు..

వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో ఈ ఇద్దరు దొంగలు గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో వున్న మోటార్ల రాగితీగలను చోరీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఏమీ తెలియనట్లు పొలాల్లో వెల్లడం అతరువాత అక్కడ మోటర్లకు వున్న రాగితీలను దొంగలించడం వీరి ప్లాన్. అలా కొద్దిరోజులుగా సాగిన వీరి దొంగతనానికి పుల్ స్టాప్ పడింది. నిన్న ఓ పొలంలో ఇద్దరు దొంగలు వెళ్లారు. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో దొంగతనం ఈజీగా చేసేయొచ్చని అనుకున్నారు. కానీ.. అక్కడి నుంచే వెళుతున్న ఓ రైతు వారిద్దరిని గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా.. పొలాల్లో వున్న మోటార్ల రాగితీగలను చోరీ చేస్తున్నవారిని రెడ్డ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అక్కడే వున్న రైతులను పిలవడంతో అక్కడకు రైతులందరూ చేరుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు దొంగలు ఇక నుంచి దొంగతనం చేయమని, రైతు కాళ్లు పట్టుకున్నారు. దీంతో వారిద్దరిని కొట్టకుండా రైతులు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెల్గటూర్ గ్రామ శివారులో ఈ దొంగలు గుడారాలు వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజులుగా కోటిలింగాల, పాశిగామ, మొక్కట్రావుపేట గ్రామాల్లో సుమారు 25 మంది తమ పంటలకు చెందిన రాగి తీగలను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Aam Admi Party: ఢిల్లీ వరదలకు హర్యానా సర్కారే కారణం