Site icon NTV Telugu

Robbery Case: వనస్థలిపురం దోపిడీ కేసులో ట్విస్ట్… 2కోట్లు కాదట..!

Vanasthalipuram Robbery Case

Vanasthalipuram Robbery Case

A new twist in Vanasthalipuram robbery case: వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద హవాలా లింక్ లు ఈదోపిడీ వెనుక ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. అయితే ఈ హవాలా లింక్‌లలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పటి వరకు ఎంత కాజేశారనే విషయంలో పోలీసులు విచారణచేపట్టారు. దోపిడీ జరిగిన సమయంలో వ్యాపారి వెంకట్ రెడ్డి వద్ద 50 లక్షలు వున్నట్టు పోలీస్ లు గుర్తించారు. 24 గంటల పాటు పోలీస్ లకు స్పష్టమైన సమాచారం వెంకట్ రెడ్డి ఇవ్వలేదు. మొదట వెంకట్ రెడ్డి పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదులో 50 లక్షలు పోయాయని వెంకట్ రెడ్డి చెప్పాడు. అయితే.. వెంకట్ రెడ్డి తో పాటు వున్న నరేష్ కోటిన్నర పోయిందంటూ పోలీస్ లకు సమాచారం ఇచ్చాడు. పోలీసుకు పొంతన లేని సమాచారంతో… అసలు దోపిడీ జరిగిందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. తరువాత 25 లక్షలు దోపిడీ జరిగిందని పోలీసుల తేల్చేశారు. దోపిడీ చేసిన నిందితులను పోలీస్ లు గుర్తించారు. హవాలా వ్యాపారంపై స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీకి చెందిన ఫరూక్ తో పాటు విదేశాల్లో వున్న ప్రవీణ్ అనే వ్యక్తికి హవాలా వ్యాపారంతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. దోపిడీకి ముందు వెంకట్ రెడ్డికి డబ్బు చేరవేసిన వ్యక్తుల పాత్రపై కూడా పోలీస్ ల దర్యాప్తు కొనసాగుతుంది.

Read also: Somesh Kumar: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు ఆదేశం

వనస్థలిపురంకు చెందిన వెంకట్రామి రెడ్డి అక్కడే ఓ రెండు వైన్స్‌లు, ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత రాత్రి బార్ మూసేసిన తర్వాత వచ్చిన కలెక్షన్ రూ.2కోట్లను బ్యాగులో పెట్టుకొని ఇంటికి బయల్దేరారు. వెంకట్రామిరెడ్డి, మరో వ్యక్తి కలిసి వెళ్తున్న బైకును దుండగులు అడ్డగించారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.2 కోట్లను దోచుకుపోయారు. బాధితుడు వెంటనే కింద పడిన డబ్బును తీసుకుని వనస్థలిపురం పోలీసు స్టేషన కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు బయటపడటంతో.. పోలీసులు దోపిడి జరిగింది రూ. 2కోట్లు కాదు.. రూ25లక్షలు మాత్రమే అని దర్యాప్తులో తేల్చారు.

Exit mobile version