Hawala money: సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇవి హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. 1.64 కోట్ల నగదు, భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో లేడు. పని చేసే ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రభుత్వ విద్యుత్ వ్యాపారం కాంట్రాక్టు పనులు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి హవాలా నగదు కుప్ప కనిపించింది. దీంతో స్థానిక పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి హవాలా సొమ్ముపై ఆరా తీస్తున్నారు. హవాలా లావాదేవీల వ్యవహారంలో శ్రీనివాస్ పై దృష్టి సారించారు. మీరు ఏదైనా హవాలా వ్యాపారం చేస్తున్నారా? హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఐటీ దర్యాప్తు చేస్తోంది. ఐటీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Read also: Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు రోజులు హీటెక్కించనున్న ఎండలు
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చెక్క ఫర్నీచర్ ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు పొగ వ్యాపించడంతో అంతా అంధకారంగా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని గుర్తించారు. కాగా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
Ponzi Scam : స్కీం పేరుతో స్కాం.. దంపతులకు 12,640ఏళ్ల జైలు శిక్ష