Site icon NTV Telugu

Suspicious Incident: ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. హత్యేనంటు తెరమీదికి కొత్త వాదన

Love Deth

Love Deth

Suspicious Incident: హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పూజాది ఆత్మహత్య కాదు హత్య అంటూ కొత్త వాదన వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. మరికొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పూజా హత్యకు దయాకర్, అతని తల్లి పథకం పన్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. గత కొంత కాలంగా పూజను దయాకర్ వేధిస్తున్నట్లు వెల్లడైంది. దయాకర్ కావాలనే పూజను తమ ఇంటికి తీసుకెళ్లి ఉరివేసి చంపారని పూజ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరోవైపు దయాకర్‌ ప్రియుడితో పాటు అతడి తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

అసలు ఏం జరిగింది?

పూజ అనే అమ్మాయి మెహిదీపట్నంలో ఉంటూ చైతన్యపురిలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుతోంది. ఆమెకు కొన్నాళ్ల క్రితం జవహర్‌నగర్‌లోని యాప్రాకు చెందిన దయాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇరువర్గాలు కుటుంబీకులను ఒప్పించేందుకు ప్రయత్నించగా పూజా కుటుంబం అంగీకరించింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం దయాకర్ తల్లికి నచ్చలేదు. దయాకర్ తల్లి తన కొడుకును హెచ్చరించడమే కాకుండా సంబంధాన్ని వదులుకోవాలని పూజను కోరిందని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. అయితే దయాకర్ తల్లి ఈ రిలేషన్ షిప్ గురించి పూజా తల్లిదండ్రులకు నేరుగా తెలియజేసినట్లు సమాచారం.

తర్వాత దయాకర్ పూజా ప్రియురాలికి ఫోన్ చేసి చైతన్యపురిలో కలిసేందుకు ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత పూజను తీసుకుని దయాకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ పూజ, దయాకర్ తల్లి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఘర్షణల మధ్య పూజ హడావుడిగా లేచి ఓ గదిలోకి వెళ్లి తాళం వేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజ ఆ గదిలో ఉన్న కండువాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దయాకర్‌తో పాటు అతని తల్లిపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే పూజా తల్లిదండ్రుల వాదన మరోలా ఉందని దీనిపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Cyber Crime: బ్యాంకు ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. థాలీ పేరుతో ఖాతా ఖాళీ

Exit mobile version