NTV Telugu Site icon

Madhu Mohan: టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీ గూటికి తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన… తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా కాషాయ కండువాలు కప్పుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్‌ను తిడితే టీఆర్ఎస్‌కు ఎందుకు నొప్పి?

కాగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కౌన్సిలర్‌గా గెలిచిన మధు మోహన్ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నాయిని నర్సింహారెడ్డి, కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, ఎగేమల్లేశం సహకారంతో స్వతంత్ర అభ్యర్థి మధుమోహన్‌ను పార్టీలోకి చేర్చుకుని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.