NTV Telugu Site icon

నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ

టీఎస్‌ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినాటి నుంచి వినూత్న కార్యక్రమాలకు ప్రవేశపెడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అయితే తాజా మరో కొత్త కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుట్టించి. ఇక నుంచి పెండ్లిలకు బస్సును బుక్‌ చేసుకుంటే నూతన వధూవరులకు ఆర్టీసీ తరుపున జ్ఞాపికను అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

ఒక్క రోజే 500 వివాహాల్లో 500 నవ దంపతులకు ఆర్టీసీ తరుపున షీల్డ్ ను ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానం చేశారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ప్రయాణికులు ఆర్టీసీపై దృష్టి పెట్టారని, ఆర్టీసీ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది మంచి పరిణామమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బస్సులో డిజిటల్‌ పేమెంట్‌, బాలింతలు పిల్లలకు పాలిచ్చేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంకో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళుతున్నారు.