NTV Telugu Site icon

TSRTC : బంపర్‌ ఆఫర్‌.. షార్ట్‌ఫిల్మ్‌ తీయండి.. నగదు గెలుచుకొండి..

Tsrtc

Tsrtc

ప్రజల్లోకి వెళ్లేందుకు టీఎస్‌ ఆర్టీసీ కొత్తకొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరో అడుగు వేస్తోంది టీఎస్‌ఆర్టీసీ. ఇప్పటికే పలు విధాల కార్యక్రమాలతో ఆర్టీసీని అందుబాటులోకి తీసువచ్చారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందు నిర్వారామంగా కృషి చేస్తున్నారు. నిత్యం ట్విట్టర్‌ స్పందిస్తూ.. ప్రయాణికుల సమస్యలే కాకుండా.. ఆర్టీసీ ఉద్యోగల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు.

అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీలో ప్రయాణిస్తే ఎంత సురక్షితమో, టీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న సేవల గురించి తెలిపే విధంగా షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌ను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో గెలిచిన వారికి నగదు బహుమతులు కూడా అందజేయనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. మొదటి బహుమతి రూ.10 వేలు, రెండవ బహుమతి రూ. 5 వేలు, మూడవ బహుమతి రూ.2500లుగా, వీటితో పాటు 10 మందికి కన్సోలేషన్‌ బహుమతులు కూడా ఉన్నట్లు ప్రకటించింది.

ఈ కింద పేర్కొన్న ఏదో ఒక అంశంపైనే షార్ట్ ఫిలింలు తీయాల్సి ఉంటుంది. వ్యవధి : 120 Seconds/2 Mins

1. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం
2. లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువకే రూ.100కి రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం
3. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్‌
4. ఆర్టీసీ కార్గో సేవలు
5. గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు