Site icon NTV Telugu

TSRTC New Plan: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు

Telangana Bus Modal

Telangana Bus Modal

TSRTC New Plan: మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగింది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. ఇక నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉదయం పూట ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సోమ, బుధవారాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. బస్సుల్లో కూర్చునే సమస్య ఉంది. దీంతో బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన tsrtc కొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి, మెట్రో రైలులో మాదిరిగానే ఇరువైపులా సీటింగ్‌ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ స్థలం ఉండడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.

Read also: CPI Ramakrishna: ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!

ఈ మేరకు కొన్ని బస్సుల్లో సీట్లు మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్‌లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సిటీ బస్సుల్లో 44 సీట్లు ఉంటే 63 మంది ప్రయాణిస్తే 100% ఆక్యుపెన్సీని ఆర్టీసీ పరిగణిస్తుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు, కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది. టిక్కెట్ల ప్రక్రియలో ఎవరికీ జీరో టికెట్ ఇవ్వకున్నా కండక్టర్ పైనా చర్యలు తీసుకుంటున్నందున ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా సీటింగ్ సిస్టమ్ మార్చడమే మంచిదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మరి ఆర్టీసీ మెట్రో తరహా బస్సుల ఈ కొత్త విధానం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Business Payments via Cards : వీసా, మాస్టర్‌కార్డ్‌లపై ఇక ఆ చెల్లింపులు నిషేధం

Exit mobile version