NTV Telugu Site icon

TSRTC New Rule: కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్ గురూ.. ఈనెల 27 నుంచే అమలు

Bus Vindo Seat

Bus Vindo Seat

TSRTC New Rule: టీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశంలో తొలిసారిగా విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని ప్రభుత్వ రంగంలో అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. ఈనెల 27వ తేదీ నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానంలో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది. అంతేకాకుండా.. సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. అయితే.. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. ఇదే కాదండోయ్‌ ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఎక్కువ ధర ఉంటుంది. అంటే.. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఇక.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.

Read also: Rohit Sharma : వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లొద్దా..?

అయితే.. ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజులకు పెంచింది. ప్రయాణించే వారి అవసరాలకు అనుగుణంగా ప్రారంభించిన కార్గో, డిజిటల్ సేవలు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. అయితే.. కార్గో సేవలపై కొన్ని విమర్శలు వస్తున్న క్రమంలో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక, వరంగల్ కళాశాలలో హుందాగా ప్రవర్తించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు. దీంతో.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక.. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు ఛార్జీల్లో మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని నూతన పద్ధతులు తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.


Traffic challan: బైక్ ఒకరిది.. ట్రాఫిక్‌ చలానా మరొకరికి..