Site icon NTV Telugu

TSRTC : ఉక్రెయిన్‌ బాధితులకు ఉచిత బస్సు సర్వీస్‌..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్​ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ఇలా విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులకు వారి ఊర్లకు వెళ్లేందుకు టీఎస్ఆర్‌టీసీ మరో ముందడుగు వేసింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.

విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్‌కు చేరుకున్న విద్యార్థులు కానీ, మార్గమధ్యంలో ఎక్కిన వారు కానీ ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే, తాము ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టు తగిన ఆధారం చూపించాల్సి ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది.

Exit mobile version