NTV Telugu Site icon

Anantgiri Ghat Road: బ్రేక్‌ ఫెయిల్ కావడంతో లోయలో పడ్డ బస్సు.. 70 మంది ప్రయాణికులు

Anantgiri Ghat Road

Anantgiri Ghat Road

Anantgiri Ghat Road: వికారాబాద్ జిల్లా అనంత‌గిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జ‌రిగింది. 70 మంది ప్రయాణికుల‌తో వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో..ఈ ప్రమాదంలో ఓ మ‌హిళా ప్రయాణికురాలు అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోగా.. 10 మందికి తీవ్ర గాయాలుకాగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. క్షత‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రమాదం జ‌రిగిన స‌మ‌యంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

read also: MLA Jeevan Reddy: రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారు

అయితే ఇవాళ ఉదయం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ లో ఆగివున్న బస్సును గోవా నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మారుతి XL-6 (TS 08 HS 8110) కారు, ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురిలో జయ సాయి అనే విద్యార్థి మృతి చెందగా.. ఆకాష్, శ్రీరామ్ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక నితీష్, మణికంఠ, శివమణి, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి చదువుతున్న విద్యార్థులుగ గుర్తించారు పోలీసులు. ఈ ఉదయం మూడు గంటల సమయంలో గోవా నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఇస్నాపూర్ ఎస్బిఐ బ్యాంకు వద్ద ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.
Jabardasth New Anchor : జబర్దస్త్ కొత్త యాంకర్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు