NTV Telugu Site icon

Medak: నర్సాపూర్‌లో విషాదం.. తల్లి మందలించిందని కొడుకు ఘాతుకం

Medak Crime

Medak Crime

Medak: వినాయక చవితి రోజు ఓ బస్సు కండక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మందలించడంతో మనస్తాపం చెంది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది.

నర్సాపూర్‌కు చెందిన సాయితేజ(24) ఆర్టీసీ బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే తండ్రి చనిపోవడంతో సాయితేజకు తండ్రి ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు రెగ్యులర్ గా పనిచేసిన సాయితేజ మద్యానికి బానిసయ్యాడు. విపరీతంగా మద్యం సేవించి పనికి వెళ్లడం ప్రారంభించాడు. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో సాయితేజ తల్లి మందలించింది. తండ్రి చనిపోయినప్పటి నుంచి తీవ్ర విషాదంలో వెళ్లిన తల్లి కొడుకు ప్రవర్తనకు విషుగు చెందింది. విధులకు వెళ్లాలని మద్యానికి బానిసగా మారొద్దని చెప్పింది. ఈ వయసులో తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని గట్టిగా చెప్పింది. తనమీదే ఆశలన్నీ పెట్టుకుని బతుకుతున్నానని కన్నీరుమునీరుగా విలపించింది. ఇప్పటికైనా మారాలని విధులకు హాజరవ్వాలని కోరింది. కానీ తల్లి మాటలకు సాయితేజ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. తను చనిపోతే తల్లి పరిస్థితి ఏమవుతుందని కూడా ఆలోచించలేకపోయాడు. కోపంతో నర్సాపూర్ ఆర్టీసీ డిపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. డిపో భద్రతా సిబ్బంది గమనించి వెంటనే మంటలను ఆర్పారు. అనంతరం సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత చిన్న విషయానికే ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో సాయితేజ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కుటుంబానికి అండగా వుండాల్సిన కొడుకు చిన మాటతో తల్లినే వదిలేసి వెళ్లిపోయేందుకు సిద్దపడ్డాడేంటి అంటూ వాపోయింది.
Funny Case: కోసిగి పీఎస్‌లో విచిత్రమైన ఫిర్యాదు.. తలలు పట్టుకున్న పోలీసులు!