NTV Telugu Site icon

TSPSE AEE Hall Tickets: ఏఈఈ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?

Aee Hall Tickets

Aee Hall Tickets

TSPSE AEE Hall Tickets: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జనవరి 22న జరగనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను TSPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. AEE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC ID , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 22న మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి కనీసం 45 నిమిషాల ముందు అభ్యర్థులు తమ నిర్దేశిత పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TSPSC సూచించింది.

Read also: Raghunandan Rao: నిన్నటి వరకు దొంగల్లా కనిపించిన ఆంధ్రోళ్లు ఇవాళ ఆప్తులా?

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు. పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మిషన్ భగీరథ, నీటిపారుదల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గిరిజన సంక్షేమం, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో వీటిని భర్తీ చేస్తారు. AEE పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి, అక్టోబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ కాగా.. గడువును పొడిగించేందుకు అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో.. మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

Read also: Harish Rao: ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..

పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 1540
1) AEE(సివిల్)- PRRD విభాగం (మిషన్ భగీరథ): 302 పోస్టులు
2) AEE(సివిల్)- PRRD విభాగం: 211 పోస్టులు
3) AEE (సివిల్) MA UD-Ph: 147 పోస్ట్‌లు
4) AEE(సివిల్) TW విభాగం: 15 పోస్టులు
5) AEE ICAD విభాగం: 704 పోస్టులు
6) AEE (మెకానికల్) ICAD(GWD): 03 పోస్టులు
7) AEE (సివిల్) TRB: 145 పోస్టులు
8) AEE (ఎలక్ట్రికల్) TRB: 13 పోస్టులు

తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించబడింది)
* పరీక్ష తేదీ: 22.01.2023.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం