NTV Telugu Site icon

TS TET Hall Ticket: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల..

Ts Tet Hall Ticket

Ts Tet Hall Ticket

TS TET Hall Ticket: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. వాస్తవానికి ఈ నెల 15న హాల్‌టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినా.. ఒక్కరోజు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా టెట్‌కు 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే 20 నుంచి జూన్ 6 వరకు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 12న టెట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Read also: Telangana: నెంబర్ ప్లేట్లపై TS స్థానంలో TG.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

అయితే ఈ ఏడాది తొలిసారిగా టెట్ పరీక్షల కోసం విద్యాశాఖ ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తోంది. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మే 27న పట్టభద్ర ఎన్నికలు జరగనున్నందున ఈ తేదీన ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. మే 20 నుంచి జూన్ 2 వరకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో పేపర్ 2 పరీక్షలు జరగనున్నాయి. సామాజిక శాస్త్ర పరీక్షలు మే 24న మైనర్ మీడియంలో నిర్వహించనున్నారు. జూన్ 1న మైనర్ మీడియంలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షలు మే 30 నుంచి జూన్ 2 వరకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాల్లో జరగనున్నాయి. పేపర్-1 పరీక్షలు జూన్ 2న ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల నియామకం పొందడానికి టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాసేందుకు కూడా అర్హత సాధిస్తారు.
Current Bill: ఒక నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. మూర్ఛపోయిన యజమాని