NTV Telugu Site icon

TS SSC Results 2024: నేడే టెన్త్‌ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల

10th Result Telangana

10th Result Telangana

Telangana SSC Results 2024

TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08,385 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది.

Telangana SSC Results 2024

ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. https://ntvtelugu.com/telangana-ssc-results-2024 వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగియగా.. మే 10న ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 రోజుల ముందుగానే పరీక్షలు పూర్తయ్యాయి.

Telangana SSC Results 2024

ఇప్పటికే ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఏపీ 10 పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా పార్వతీపురం జిల్లాలో 96.37 మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.47 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మే 24 నుంచి జూన్ 3 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు.

Telangana SSC Results 2024

Ashtalakshmi Stotram: మంగళవారం తప్పక వినాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రాలు..

Show comments