TS POLYCET: తెలంగాణ పాలిసెట్ (TS POLYCET-2023) ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం (మే 26) విడుదల కానున్నాయి. మే 26న ఉదయం 11 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్ ఫలితాలను వెల్లడిస్తారు. పరీక్ష ముగిసిన 8 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 17న టీఎస్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 17 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
పాలీసెట్ ప్రవేశ పరీక్షకు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా 98,273 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ ఇప్పటికే విడుదలైంది. అలాగే TS POLYCET ఫలితాలు 2023 మే 26న విడుదలయ్యే అవకాశం ఉంది. సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.
Read also: Hayathnagar Crime: హయత్‌నగర్ పాప మృతి కేసులో ట్విస్ట్..
SSC CHSL 2023: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్- (SSC CHSL 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేస్తుంది. 12వ/ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Software Employee Suicide: శివాలయంలో ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య